లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మంచి సక్సెస్ అందుకుంది అనుష్క. ఈ ఏడాది ఆమె ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో ఘాటి అనే సినిమాలో నటిస్తోంది అనుష్క. ఫీమేల్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. మహిళా రైతు జీవితాన్ని తెరపై చూపించేలా ఈ సినిమా ఉండనుంది.

ఈ మూవీలో అనుష్క కొన్ని సీన్స్ ఓల్డ్ ఏజ్ వుమెన్ గా కనిపించనుంది. గతంలో ఆమె బాహుబలి 2 లో ఓల్డ్ ఏజ్ వుమెన్ గా కనిపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి క్యారెక్టర్ లో నటిస్తోంది. ఘాటి సినిమాను యూవీ క్రియేషన్స్ తో కలిసి ఫస్ట్ షో ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది కాకుండా మలయాళంలో ఓ హారర్ థ్రిల్లర్ లోనూ అనుష్క నటిస్తోంది.