Apple Smart Watch: A Vital Tool in Medical Emergencies

Apple Smart Watch: ప్రస్తుతం రకరకాల స్మార్ట్ ఫోన్ లనే కాదు స్మార్ట్ వాచ్ లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక అనేక రకాల హెల్త్ ఫిట్నెస్ ట్రాకర్ లతో పాటూ అద్భుతమైన ఫీచర్లను ఈ స్మార్ట్ వాచ్లు కలిగి ఉండడం గమనార్హం. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో కూడా యూజర్ల ప్రాణాలను కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ట్విట్టర్ ద్వారా ఆపిల్ స్మార్ట్ వాచ్ తమకు చేసిన మేలు గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు తాజాగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి వైద్య సహాయం అందించడానికి డాక్టర్ కు ఆపిల్ వాచ్ అవసరం అయింది.(Apple Smart Watch)

Apple Smart Watch: A Vital Tool in Medical Emergencies

బ్రిటన్ నుంచి ఇటలీ వెళ్తున్న విమానంలో 70 సంవత్సరాల మహిళకి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్య సహాయం కోసం ప్రయత్నించారు. అయితే అదే విమానంలో అనుకోకుండా నేషనల్ హెల్త్ సర్వీస్ కి చెందిన డాక్టర్ రషీద్ రియాజ్ ప్రయాణం చేస్తుండగా వెంటనే బాధితురాలు వద్దకు వచ్చి ఆయన ఆమె పరిస్థితిని గమనించారు.

Also Read: LG QNED 83 Series: LG నుంచి కొత్త స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ అదుర్స్..!

బాధితురాలు పూర్తి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి తనకు వెంటనే ఆపిల్ స్మార్ట్ వాచ్ అవసరం ఉందని.. విమాన సిబ్బందికి సూచించగా.. విమాన సిబ్బంది అరెంజ్ చేశారు. వెంటనే ఆపిల్ స్మార్ట్ వాచ్ లో బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ ద్వారా ఆమె రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తక్కువ శాతం రక్తప్రసరణ జరగడం వల్లే ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని.. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని కూడా డాక్టర్ గుర్తించారు.(Apple Smart Watch)

దీంతో పాటు ఆమెకు గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. వెంటనే ఆ మహిళకు ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ అందించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఒక మహిళ ఆరోగ్యాన్ని ఆపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆపిల్ స్మార్ట్ వాచ్ లో ఏర్పాటు చేసిన ఈ ఫీచర్లు స్పష్టమైన ఖచ్చితమైన ఆరోగ్య రేటింగ్ అందిస్తుండడం వల్లే కస్టమర్లు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇందులో SOS ఫీచర్ ను కూడా చేర్చడం గమనార్హం. ఈ ఫీచర్ కూడా కొంతమంది ప్రాణాలను కాపాడినట్లు సమాచారం.(Apple Smart Watch)