ప్రజలను నమ్మించడం… ఆ తరువాత మాట తప్పి మోసం చేయడం..ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ … పాతికేళ్ల క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తాం అని 1999 లో హామీ ఇచ్చారు.. పోనీ చేసారా ? ఉద్యోగాలు ఇచ్చారా ? లేదు…కానీ తనను తాను ఓ విజనరీ అని మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు.అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే ఇస్తాం అని మాట ఇచ్చారు… అదేమైనా చేసారా ? చేయలేదు..కానీ మళ్ళీ తాను విజనరీ అని చెప్పుకుంటారు..

ఎంతసేపూ మీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ రాష్ట్రానికి తానె దిక్కు అనేలా ప్రచారం చేసుకోవడం మినహా… ఇన్నేళ్ళలో ఇదిగో…నేను ఇది చేశాను అని చెప్పుకునేందుకు ఏమీ లేదు… కానీ మళ్ళా ఆంధ్రాకు నేనే దిక్కు అంటారు

పెన్షన్లు… ఇతర అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దాన్ని మళ్ళీ ఎదురు జగన్ మోహన్ రెడ్డి మీదకు నెట్టేయడం….. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు పేరిట ప్రజల భూములు లాక్కుంటారంటూ అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించి లబ్ధిపొందడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు…. కానీ విజ్ఞులైన ప్రజలు మాత్రం తమకు ఎవరేమిటన్నది తెలుసనీ… ఎన్నికల సమయంలో ఓటుతో సమాధానం చెబుతామని అంటున్నారు…