Combat Illness with These 5 Healing Foods

Healing Foods: జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అలాగే కడుపులో గడబిడగా ఉన్నప్పుడు అసలు ఏమి తినాలనిపించదు. నీరసంగా ఉంటుంది. అయినప్పటికీ అటువంటి సమయాల్లో మనం బాగా తినాలని మన శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అప్పుడే మన శరీరం వేగంగా కోలుకుంటుంది. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సరేనా ఆహారం మంచి అనుభూతిని కలిగిస్తుంది. మరింత శక్తిని కూడా ఇస్తుంది. ఒంట్లో బాలేనప్పుడు ఆహారంలో కార్బోహైడ్రేట్స్, కొవ్వు క్యాలరీలు అతిగా ఉండకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. మీ అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు త్వరగా కోలుకోవడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Combat Illness with These 5 Healing Foods

Ginger tea:

అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. అల్లం టీ తాగడం వల్ల వికారం తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.శరీరానికి వెచ్చదనం అందిస్తుంది. శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది.

Bananas

అరటి పండ్లలో విటమిన్ సి, బి6 సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మద్దతు ఇస్తాయి. అరటిపండు తేలికగా జీర్ణం అవుతుంది. అరటి పండ్లలోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతాయి. అరటిపండు లోని పోషకాలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి.

honey

తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది. తేనెలోని సహజమైన చక్కరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబియర్ లక్షణాలు ఉంటాయి.

the rice

మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మొదటగా గుర్తుకు వచ్చేది అన్నం ఒకటి. అన్నం సులభంగా జీర్ణం అవుతుంది. కడుపులో నొప్పి ఉన్నప్పుడు అన్నం తింటే మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నంలో విటమిన్ బి రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. (Healing Foods)

Carrot soup

క్యారెట్ సూపులో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది క్యారెట్ సులభంగా జీర్ణం అవుతుంది. శరీరానికి వెచ్చదనం అందిస్తుంది ఇది మొత్తం ఆరోగ్యం రోగనిరోధక వ్యవస్థ పనితీరును మద్దతు ఇస్తుంది.