deepika padukune

Deepika Padukone: దీపికా పదుకొణె ఈ పేరును తెలుగు వారికి మళ్లీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దీపికా తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన కల్కి (కల్కి 2898 AD) చిత్రంలో నటిస్తోంది.

Deepika Padukone Announces Pregnancy

ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. మే లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా తాను తల్లి కాబోతున్నట్లు దీపిక ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పుకార్లు చెలరేగడంతో, వాటికి ముగింపు ఇస్తూ, దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ వార్తతో దీపిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం దీపిక ‘సింగం ఎగైన్‌’, ‘ది ఇంటర్న్‌’ చిత్రాల్లో నటిస్తోంది. పెళ్లయ్యాక తన భర్తతో కలిసి నటించిన “83” సినిమా పెద్దగా రెస్పాన్స్‌ను తెచ్చిపెట్టలేదు. తరువాత, ఆమె తన భర్తతో కలిసి రణవీర్ సింగ్ నటించిన సర్కస్‌లో ఒక పాట పాడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇ దీపిక 2018లో రణవీర్ సింగ్‌ని పెళ్లాడింది. దీపిక బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. (Deepika Padukone)

దీపికా పదుకొణె సినీ కెరీర్ విషయానికొస్తే, ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన షారుఖ్ ఖాన్ చిత్రం ఓం శాంతి ఓమ్‌లో ఆమె తొలిసారిగా కథానాయికగా నటించింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మొదట రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి “రామ్ లీలా” చిత్రంలో నటించింది. ఆ తర్వాత “బాజీరావ్ మస్తానీ” సినిమాలో నటించింది. ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.ఈ సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి.