విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి కూడా చాలా కంఫర్ట్ గా రెండున్నర గంటలు ఉంది. క్లీన్ యు సర్టిఫికెట్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఫ్యామిలీ స్టార్ చూడొచ్చు.

ఇప్పటికే ఈ సినిమా మీద పాజిటివ్ ఓపీనియన్ ఉంది. ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. “ఫ్యామిలీ స్టార్” సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు.ఈ సినిమా రేపు ఘనంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. తెలుగుతో పాటే చెన్నైలోనూ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.