రెబెల్ స్టార్ ప్రభాస్ భారీ పాన్ ఇండియా లైనప్ కంటిన్యూ అవుతోంది. ఆయన ప్రస్తుతం కల్కి సినిమాను రిలీజ్ కు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ సినిమాను మే 30న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. రాజా సాబ్ సినిమా సెట్స్ మీద ఉంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెట్స్ లో ఈ నెలలోనే ప్రభాస్ జాయిన్ కానున్నారు. ఈ కరెంట్ ప్రాజెక్ట్స్ ఇలా ఉండగా..ప్రభాస్ హను రాఘవపూడి కాంబోకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా సాగే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిట్ పరిశీలిస్తున్నారట. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. వరల్డ్ వార్ నేపథ్య సినిమా కాబట్టి ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అనౌన్స్ కానుంది. సీతారామం సినిమా మేకింగ్ చూశాక స్టార్ హీరోస్ లో హను రాఘవపూడిపై నమ్మకం పెరిగింది. ఫౌజీ ప్రభాస్ కెరీర్ లోనూ ఓ స్పెషల్ మూవీ కానుంది.