రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. మహాభారతంలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కనిపించనున్నారు. శివపూజలో ఉన్న అశ్వత్థామ అంతిమ యుద్ధం చేసేందుకు సమయం వచ్చిందంటూ నడిచి వెళ్లిన వీడియోను రిలీజ్ చేశారు.

మహాభారత కాలంతో భవిష్యత్ కు ముడిపడిన కథతో 6 వేల ఏళ్ల టైమ్ ట్రావెల్ తో కల్కి సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలో వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ రివీల్ చేసిన వీడియోలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ప్రపంచం నీ కోసం వెయిట్ చేస్తోంది అనే క్యాప్షన్ ఈ వీడియో చివరలో ఇచ్చారు. కల్కి సినిమాలో భైరవ క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తున్నారు. జూన్ లో కల్కి 2898 ఎడి రిలీజ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.