హీరో నాగార్జున మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనున్నారు. రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న సినిమాలో నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల లోకేష్ కనకరాజ్ అన్నపూర్ణ వర్చువల్ స్టూడియోకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి హింట్స్ బయటకు రావడం మొదలైంది. రజినీకాంత్ నటిస్తున్న 171వ సినిమా ఇది.

సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ చేశారు. త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు. నాగార్జున కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ కాబోతోంది. ప్రస్తుతం నాగ్ ధనుష్ తో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున ఇకపై సోలో హీరోగా సినిమాలు తగ్గించి ఇలా స్పెషల్ రోల్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.