రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. ఆయనను డార్లింగ్ క్యారెక్టర్ లో, వింటేజ్ లుక్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజా సాబ్ తో ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు దర్శకుడు మారుతి. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ గా చూపించబోతున్నారు మారుతి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండటమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

రీసెంట్ గా రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్స్ కలిసి స్టెప్పులేసిన పాటను షూట్ బిగిన్ చేశారట. ఈ పాటలో ప్రభాస్ తో రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కనిపించనున్నారు. యాక్షన్ సినిమాలు చేస్తుండటంతో ప్రభాస్ డ్యాన్సులను ప్రేక్షకులు మిస్ అవుతూ వచ్చారు. ఈ లోటును రాజా సాబ్ తీర్చనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నెక్ట్ ఇయర్ రిలీజ్ కు రాబోతోంది.