తమన్నా హీరోయిన్ గా నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ఆరణ్మని 4 తెలుగులో బాక్ పేరుతో రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ నెల 26న రిలీజ్ కావాల్సిన బాక్ సినిమా మే 3కు పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించారు. రాశీ ఖన్నా మరో కీ రోల్ చేస్తున్న బాక్ చిత్రాన్ని దర్శకుడు సుందర్. సి రూపొందించారు.

ఆరణ్మణి సిరీస్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. మొదటి చిత్రానికి తెలుగులో కళావతి అనే పేరు పెట్టారు. హన్సిక హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అదే పేరుతో సీక్వెల్స్ వచ్చాయి. ఈసారి మాత్రం తెలుగు పేరు మార్చి బాక్ అని పెట్టారు. ఈ సినిమాలో హారర్ తో పాటు తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ షో కూడా ఉండబోతోంది.