నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఇదే తేదీన ఎన్టీఆర్ దేవర కూడా రిలీజ్ అనౌన్స్ చేశారు. అనివార్యంగా దేవర, తండేల్ బాక్సాఫీస్ పోటీ తప్పదనే అంతా భావించారు. అయితే దేవరతో పోటీ నుంచి తండేల్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ కు రిలీజ్ మార్చుకున్నారీ మూవీ టీమ్. స్టార్స్ గా నాగ చైతన్య, ఎన్టీఆర్ లను పోల్చలేం.

అయితే ఎవరి సినిమాకు ఉండే స్పేస్ వారికి ఉంటుంది. దేవర టీమ్ ముందే దసరాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల తండేల్ ఈ అన్ హెల్తీ పోటీ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న తండేల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తండేల్ రిలీజ్ కానుంది.