‘బలగం’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఈ సినిమాప ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా, ఆగస్టు 2న దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషనల్ అప్డేట్ను నిర్మాణ సంస్థ టీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు మేకర్స్ వెల్లడించలేదు. హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా స్వరాలు అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The put up ‘ఎల్లమ్మ’ నుండి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడంటే..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
