బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసం సల్మాన్ ఖాన్ తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం.
సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే సల్మాన్, ఈ సినిమా కోసం కేవలం రూ.70 కోట్లు మాత్రమే తీసుకోవడానికి అంగీకరించాడట. సల్మాన్ ఖాన్ ప్రాణస్నేహితుడు రఫీ కాజీ ఈ ప్రాజెక్ట్ ఓకే కావడంలో కీలక పాత్ర పోషించారని, అందుకే ఆయన మాట కోసం సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాప్ స్టార్స్ తమ పారితోషికం తగ్గించుకోవడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉండి, సినిమా విజయం సాధిస్తే నిర్మాతలకు మంచి లాభాలు అందుతాయి.
ఈ క్రేజీ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
The submit దిల్ రాజు మూవీ కోసం సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
