Mon. Jun 29th, 2026

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. మన స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని ఓ డిజిటల్ మైలురాయిని ఆయన చేరుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2017లో వచ్చిన కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘జయ జానకి నాయక’ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ దాటేసి సరికొత్త చరిత్ర లిఖించింది.

‘ఖుంఖార్’ (Khoonkhar) పేరుతో పెన్ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఫుల్ లెంగ్త్ సినిమాను అప్‌లోడ్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఈ మూవీకి నార్త్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏమాత్రం తగ్గలేదు. నెమ్మదిగా వ్యూస్ రాబడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసింది. తద్వారా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన అతికొద్ది సినిమాల జాబితాలో చేరిపోయింది.

యూట్యూబ్‌లో ఏకైక తెలుగు హీరో

ఈ భారీ రికార్డుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. యూట్యూబ్‌లో ఒక ఫుల్ మూవీకి 1 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఏకైక తెలుగు హీరోగా ఆయన నిలిచారు. టాలీవుడ్‌కు చెందిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హిందీలో డబ్ అయి యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, మరే ఇతర హీరో కూడా సింగిల్ వీడియోతో ఈ స్థాయి వ్యూస్ సాధించలేకపోయారు.

రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద మాత్రం సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ డైలాగ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ డైలాగ్ ట్రెండ్ అవ్వడంతో సినిమా మరోసారి వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన దాదాపు ఏడేళ్ల తర్వాత కూడా ‘ఖుంఖార్’కు లక్షల సంఖ్యలో వ్యూవర్స్ వస్తుండటం నార్త్ బెల్ట్‌లో ఈ యాక్షన్ డ్రామాకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను స్పష్టం చేస్తోంది.

The submit ఏ టాలీవుడ్ హీరోకు సాధ్యం కాని రికార్డ్.. బెల్లంకొండ సృష్టించిన ఆల్ టైమ్ సెన్సేషన్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.