‘దబాంగ్’ మూవీతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. మొత్తానికి మొదటి చిత్రంతోనే తన నటనతో, తన అందంతో సోనాక్షి సిన్హా మంచి ఫేమ్ నేమ్ సంపాదించుకుంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘వందశాతం నేను ఎంచుకుంటున్న ప్రాజెక్ట్‌లతో బలమైన మహిళా ప్రాధాన్య కథల వైపే నడుస్తున్నాను. కారణం.. ఒక నటిగా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేదే నాకు ముఖ్యం. ‘సిస్టమ్’ సినిమా ప్రచారంలో దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ నన్ను హాలీవుడ్ దిగ్గజ నటీమణులతో పోల్చారు.
వారిలా ఉండాలని నేను ప్రయత్నించకపోయినప్పటికీ.. ఎంతగానో ఆరాధించే, అభిమానించే దిగ్గజాలతో పోల్చడం మంచి అనుభూతినిచ్చిందని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సోనాక్షి సిన్హా కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్ తో అలరించింది. కానీ ఆ సినిమాలేవీ ఆమెకు కలిసి రాలేదు. దీంతో సోనాక్షి సిన్హా కెరీర్ కాస్త స్లో అయింది. ఈ లోపు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది.
The publish నాకు ఆ సంతృప్తి ముఖ్యం – సోనాక్షి సిన్హా first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
