సమంత హీరోయిన్గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకి లభిస్తున్న బలమైన ఆదరణకు అనుగుణంగానే, టికెట్ల అమ్మకాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రెండవ ఆదివారం నాడు, ఏకంగా 8,000 టికెట్లను ఈ చిత్రం అమ్ముకుంది. బుక్ మైషోలో అంతకంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. రెండవ వారాంతంలో ఈ రేంజ్ చిత్రానికి ఇది ఒక అద్భుతమైన కలెక్షన్స్ కింద లెక్కే. మొత్తానికి వచ్చే వారం కూడా ఈ సినిమా బలమైన వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని, రాబోయే చిత్రం డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్మెంట్తో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు.
The publish రెండో ఆదివారం కూడా అద్భుతమైన ఆక్యుపెన్సీ! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
