పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన హిట్ తగిలితే దాని ర్యాంపేజ్ ఎలా ఉంటుందో కూడా ఊహించడానికి లేదు. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్లి సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో చేసిన సినిమానే “ఓజి”. తన ఫ్యాన్ బాయ్ సుజీత్ తో చేసిన ఈ సినిమా పవర్ స్టార్ అంటే ఏంటో రికార్డు ఓపెనింగ్స్ తో చూపించింది.
అయితే కమర్షియల్ గా ఈ సినిమా 300 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా పరంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా మూవీ లవర్స్ లో ఒక సంతృప్తి అందించలేదు అనేది వాస్తవం. దీనికి కారణం మొదటి పార్ట్ లో బలమైన కథ కనిపించకపోవడం. సుజీత్ పార్ట్ 1 రెగ్యులర్ స్టోరీ లైన్ సాలిడ్ మ్యూజిక్, పవన్ పై క్రేజీ ఎలివేషన్స్ తో దుమ్ము లేపేసాడు.
అయితే ఇందులో మిస్ అయ్యిన అంశం ఓజి ప్రీక్వెల్ లో మాత్రం గట్టిగా ఉంటుందట. ఈసారి కథే ప్రధానం అని మొదటి భాగం చూసిన ప్రతీ ఒక్కరికీ అర్ధం అయ్యింది. ఇక అందుకు తగ్గట్టుగానే సుజీత్ కూడా పక్కా క్లారిటీతో ప్రీక్వెల్ స్టోరీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈసారి ఓజి ప్రాపర్ కథతో కూడా దిగుతున్నాడు కాబట్టి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఓజి పీక్ చూడడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
The put up ‘ఓజి 1’లో మిస్సయ్యింది ‘ఓజి 2’లో.. ఈసారి పక్కా పీక్ సంభవం! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
