Tue. Jul 7th, 2026

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లీడ్ రోల్‌లో నటుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘DC’. ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రైమరీ క్యారెక్టర్లతో కూడిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఒక డార్క్ అండ్ రా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫుల్-ఆన్ వయొలెన్స్‌తో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ మొదటిసారి స్క్రీన్‌పై ఫుల్ లెంగ్త్ హీరోగా కనిపించనుండటంతో ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు అటు ఆడియన్స్‌లోనూ ఈ మూవీపై భారీ క్యూరియాసిటీ నెలకొంది.

The submit రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ‘DC’.. ఎప్పుడంటే..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.