Fri. Mar 27th, 2026

సృజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.వెంకటేశ్వరరావు నిర్మించిన హారర్ కామెడీ చిత్రం ‘భూతం ప్రేతం’. ఈ సినిమాను రాజేష్ ధృవ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాధిక అచ్యుత్‌రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన తన బెస్ట్ విషెస్ తెలిపారు. యాదమ్మ రాజు, భాస్కర్ తన టీమ్ అని.. తన టీమ్ బాయ్స్ కోసం ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేశానని.. ఈ సినిమాతో వారు మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఇక ఈ చిత్ర పోస్టర్ చూస్తే భయం, వినోదం కలగలిపిన కథగా ఈ సినిమా రాబోతుందని అర్థమవుతోంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది.

The post డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.