ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ‘రామాయణ’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. దర్శకుడు నితీష్ తివారీ తీర్చిదిద్దిన విజువల్స్, వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండగా.. రావణాసురుడిగా యష్ తన రాయల్ అండ్ కమాండింగ్ లుక్‌తో ట్రైలర్‌కే మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. ఇక శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఆకట్టుకున్నప్పటికీ, యష్ పవర్ ముందు రణ్‌బీర్ డివైన్ అరా కాస్త తగ్గిందనే టాక్ వినిపిస్తోంది.
అటు సీత పాత్రను పోషించిన సాయి పల్లవి లుక్స్ పరంగా పర్వాలేదనిపించిందని.. అయితే, సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుందో అనే టాక్ నడుస్తోంది. కాగా శూర్పణఖ పాత్రలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మంచి మార్కులు కొట్టేసింది. గ్లామర్‌తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆమె ఈ సినిమాలో అందించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సాయి పల్లవి కంటే కూడా రకుల్ ఈ ట్రైలర్లో అదరగొట్టిందనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.
విజువల్స్ పరంగా అదరగొట్టినప్పటికీ, రామాయణానికి ఉండాల్సిన సోల్, బలమైన డైలాగ్స్ మరియు ఎమోషనల్ కనెక్షన్ ట్రైలర్లో మిస్సయ్యాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ట్రైలర్లో విజువల్స్‌తో మెప్పించిన ఈ చిత్రం, థియేటర్లలో ఎమోషనల్‌గా ఎంతవరకు కనెక్ట్ చేస్తుందో చూడాలి.
The publish రామాయణ ట్రైలర్ : సాయి పల్లవి కంటే ఆమెకే ఎక్కువ మార్కులా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
