Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్‌తో హీరోయిన్ జాన్వీ కపూర్‌కు విభేదాలు వచ్చాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ కరణ్ జోహర్‌కు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థను వీడిన తర్వాత ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. అయితే తాజా పరిణామాలు చూస్తే ఆ ప్రచారంలో నిజం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్‌ను 2018లో విడుదలైన ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం చేసింది ధర్మ ప్రొడక్షన్స్. ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘గుంజన్ సక్సేనా’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ‘హోమ్‌బౌండ్’, ‘సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి’ వంటి పలు ప్రాజెక్టుల్లో కూడా కరణ్ జోహర్ నిర్మాణ సంస్థతో ఆమె ప్రయాణం కొనసాగింది.
అయితే ఇటీవల జాన్వీ కపూర్ కరణ్ జోహర్‌కు చెందిన కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ నుంచి వైదొలగడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపించాయి. తన కెరీర్‌ను సొంతంగా, స్వతంత్రంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో జాన్వీ సౌత్ ఇండస్ట్రీపై ఎక్కువ దృష్టి పెట్టింది. వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె ఆశించిన స్థాయిలో సౌత్ నుంచి అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం ఆమె మళ్లీ బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక విభేదాల వార్తలకు చెక్ పెడుతూ ధర్మ ప్రొడక్షన్స్ మరోసారి జాన్వీ కపూర్‌తో సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘లగ్ జా గలే’ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాదు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో మరో సైకాలజికల్ రొమాంటిక్ డ్రామాను కూడా ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ‘ముంజా’ ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటించనున్నారని, ‘బేతాల్’ ఫేమ్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించే అవకాశముందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2026 చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కరణ్ జోహర్ – జాన్వీ కపూర్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి పెద్దగా ఆధారాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇద్దరూ కలిసి కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతుండటం ఆ వార్తలకు ముగింపు పలికే అవకాశంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
