యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కల్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో అందాల భామ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే, ఈ సినిమాతో పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియోతో రచ్చ చేస్తోంది.
గతంలో ఒక వేదికపై ఆమె పాడిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘శ్రీరామ్’లోని “తియ్య తియ్యని కలలను…” అనే పాటను శ్రీగౌరి ప్రియ ఎంతో మధురంగా ఆలపిస్తూ ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మొదట ఈ వీడియో చూసిన వీక్షకులు ఆ గాత్రానికి ముగ్ధులై, ఆ తర్వాత పాడుతున్నది ‘చెన్నై లవ్ స్టోరీ’ హీరోయిన్ అని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఎంతో కాన్ఫిడెంట్‌గా, శృతి తప్పకుండా ఆమె పాడిన తీరు సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్ చూసిన నెటిజన్లు ఆమె గాత్రానికి, మల్టీ-టాలెంటెడ్ నైపుణ్యానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న ఆమెకు, ఈ పాత వీడియో అదనపు మైలేజ్‌ను తెచ్చిపెట్టింది.
The submit వైరల్ వీడియోతో నెట్టింట రచ్చ చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్యూటీ..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
