తమిళ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఇడ్లీ కడాయి’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను తెచ్చుకుంది. అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమాకు తమిళ, తెలుగు బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది.
అయితే, ఈ సినిమా ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. అయితే, ఈ సినిమాకు ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. కేవలం వారం రోజుల్లో ఈ సినిమాకు 5 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి ఈ మార్క్ చేరుకునేందుకు 11 రోజుల సమయం పట్టింది.
అలాంటిది కేవలం వారం రోజుల్లో ఈ ఫీట్ అందుకోవడంతో ఈ ‘ఇడ్లీ కొట్టు’ చిత్రానికి ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుందనే విషయం స్పష్టం అవుతోంది. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించగా అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని, షాలిని పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
The put up ‘ఇడ్లీ కొట్టు’కు గిరాకీ అదిరింది..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
