Thu. Mar 26th, 2026

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

ఈ సినిమా నుంచి వచ్చిన ‘మీసాల పిల్ల’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. చక్కటి లిరిక్స్‌తో ఆకట్టుకునే ట్యూన్స్‌తో ఈ పాట ప్రేక్షకులకు ఇట్టే ఎక్కేసింది. ఇక ఈ పాటలో చిరంజీవి-నయనతార మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చడంతో వారు ఈ సాంగ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ పాటకు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను దాటింది.

2025లో తెలుగులోనే ఈ సాంగ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2025ను తమ పాట ఈ సరికొత్త మాసివ్ ఫీట్‌తో ముగించడం సంతోషంగా ఉందంటూ వారు చెబుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

The submit ‘మీసాల పిల్ల’తో మాసివ్ ఫీట్.. 2025కు సాలిడ్ ముగింపు చెప్పిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.