Fri. Jul 31st, 2026

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ మాస్ ఎంటర్టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.

ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర ఉండబోతోందని, అది ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తుందని సమాచారం. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఈ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారని, తన అనుభవంతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లారని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

The publish ‘ది ప్యారడైజ్’లో ఆయన పాత్ర సర్‌ప్రైజ్ చేయడం ఖాయమట..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.