ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో వచ్చి రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి కాంబినేషన్లో చేసిన ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది. ఇలా థియేటర్స్ లో ఇప్పుడు వరకు మంచి రన్ ని కొనసాగిస్తూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా హక్కులు జీ 5 సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో ఈ ఫిబ్రవరి 11 నుంచి అలా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది అని తెలుస్తోంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే వెంకీ మామ సాలిడ్ కామియో చేసి సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.
The submit ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’!? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
