Fri. Jul 31st, 2026

హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’(Swayambhu) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై హీరో నిఖిల్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ఈ సినిమా టీజర్ అనౌన్స్‌మెంట్ ఈ వారంలో ఉండబోతుందని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా కోసం తాను గత రెండేళ్లుగా ఎంతో తీవ్రంగా కష్టపడుతున్నాడని.. ఐస్ క్రీమ్‌కి దూరంగా ఉన్నానని.. అయితే, ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ పూర్తికావడంతో తన చిత్ర యూనిట్ తనకు ఐస్ క్రీమ్ తినిపించారంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

మొత్తానికి ‘స్వయంభు’ చిత్ర టీజర్ పై నిఖిల్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The submit ‘స్వయంభు’ టీజర్ అనౌన్స్‌మెంట్.. ఎప్పుడో రివీల్ చేసిన నిఖిల్ సిద్ధార్థ్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.