2024లో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘అమరన్’ చిత్రంతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ సుమారు రూ. 350 కోట్ల వసూళ్లను సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఘనవిజయంతో రాజ్‌కుమార్ పెరియసామి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోవడమే కాకుండా, తన తదుపరి చిత్రాన్ని వర్సటైల్ యాక్టర్ ధనుష్‌తో చేసే గోల్డెన్ ఛాన్స్‌ను దక్కించుకున్నారు.
తాత్కాలికంగా ‘D55’ అని పిలవబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. అసలు ఊహించని ఈ కాంబినేషన్ ధనుష్ అభిమానులను సర్ప్రైజ్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. గోపురం ఫిలింస్ బ్యానర్‌పై అన్బుచెజియన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ, సమాజంలోనే ఉంటూ ఎవరికీ తెలియకుండా సేవలందించే అజ్ఞాత వీరుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రానికి ప్రస్తుత మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశం మరియు క్రేజీ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోలీవుడ్‌లో మరో భారీ హిట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
The submit మరో కోలీవుడ్ ఆఫర్ పట్టేసిన శ్రీలీల.. హీరో ఎవరంటే..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
