Fri. Jul 31st, 2026
Raghunath Reddy: టాలీవుడ్‌లో విషాదం.. కొడుకు చనిపోయిన నెల రోజులకే తెలుగు నటుడు మృతి

Raghunath Reddy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన విలక్షణ నటనతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి (72) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. నెల రోజులక్రితమే ఆయన కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో ఆయన కూడా గుండెపోటుతో మరణించారని సినీ వర్గాల సమాచారం. ఆయన తెలుగు, హిందీ, తమిళ్, బోజ్పురి భాషల్లో 370కి పైగా సినిమాలు, సీరియళ్లలో కీలక పాత్రలు పోషించి వెండి తెర, బుల్లి తెరపై ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. రఘునాథ్ రెడ్డి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

READ ALSO: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. నివాసానికి నిప్పు

రఘునాథ్ రెడ్డి స్వస్థలం విజయవాడ. ఆయన భార్య అన్నపూర్ణ. వీరికి ముగ్గురు పిల్లలు సుధా లక్ష్మి, అరుణ, సుధాకర్. ఈ క్రమంలో నెల రోజుల క్రితం రఘునాథ్ రెడ్డి ఒక్కగాని ఒక్క కుమారుడు సుధాకర్ మరణించడంతో, తట్టుకోలేకపోయిన ఆయన మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రఘునాథ్ రెడ్డి కూడా తన కుమారుడు లాగానే గుండెపోటుతో కన్నుమూశారు. 1991లో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించిన శోభన్ బాబు సర్పయాగం సినిమాతో రఘునాథ్ రెడ్డి తన నట జీవితాన్ని ప్రారంభించారు.

READ ALSO: Netflix: ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. నెట్‌ఫ్లిక్స్ సొంతమైన ‘హైకూ’