Fri. Jul 31st, 2026

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ దంపతులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలువుతూ పోస్టులు పెట్టారు. ఎన్టీఆర్‌ పోస్ట్ చేస్తూ.. ‘కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన- రామ్‌చరణ్‌లకు శుభాకాంక్షలు. ఈ కుటుంబంలో ఎప్పుడూ ప్రేమ, ఆనందం, ఆరోగ్యం నిండి ఉండాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్‌ పోస్ట్ చేస్తూ.. ‘డియర్‌ చరణ్‌, ఉపాసన.. కొన్ని ఆనందకర క్షణాలు మాటలకు అందవు. మీరు ట్విన్స్‌కు జన్మనివ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం’ అని పోస్ట్ పెట్టారు. సాయి దుర్గాతేజ్‌ పోస్ట్ చేస్తూ.. ‘మా కుటుంబానికి ఇదో కొత్త అనుభూతి. చరణ్‌, ఉపాసనలకు కవలలు జన్మించడంతో మా హృదయాలు ఆనందంతో నిండిపోయింది. సుస్మిత, చరణ్‌, శ్రీజ.. చిరంజీవి మామకు బలం. అలాగే చరణ్‌కు క్లీంకార, ఈ ట్విన్సే ప్రపంచం అవుతారు’ అని తెలిపారు.

హీరో వరుణ్‌తేజ్‌ పోస్ట్ చేస్తూ.. ‘అన్నా, వదినలకు కంగ్రాట్స్‌. డబుల్‌ లవ్‌, డబుల్‌ హ్యాపీనెస్‌’ అని తెలిపారు. అలాగే, నటుడు ఆదిసాయి కుమార్‌, దర్శకులు అనిల్‌ రావిపూడి, బుచ్చిబాబు, బాబీ, వశిష్ఠ, గోపీచంద్‌ మలినేని, సంపత్‌ నంది, తదితరులు చరణ్‌ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

The publish చరణ్‌ దంపతులకు శుభాకాంక్షల వెల్లువ ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.