Fri. Jul 31st, 2026

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మాణంలో ఈ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్రం నుండి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఊరిని శాసించే ఒక పవర్‌ఫుల్ నాయకుడిగా ఆయన పాత్ర ఉండబోతుందని ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో రాషా తడానికి తండ్రిగా ఆయన కనిపిస్తుండటం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, జయకృష్ణ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ భూపతి మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌కు తోడు, మోహన్ బాబు లాంటి లెజెండరీ నటుడు విలక్షణమైన పాత్రలో నటిస్తుండటంతో ‘శ్రీనివాస మంగాపురం’ పై అంచనాలు పెరుగుతున్నాయి.

The publish శ్రీనివాస మంగాపురం : పవర్‌ఫుల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.