Wed. Apr 22nd, 2026
Satya Krishnan: అవకాశాల కోసం లొంగిపోతున్నారు.. కాస్టింగ్ కౌచ్‌పై నటి బోల్డ్ కామెంట్స్..!

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి సత్యకృష్ణ. ‘బొమ్మరిల్లు’, ‘వినాయకుడు’,‘దేవదాస్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. హోటల్ మేనేజ్‌మెంట్ చదివి, తాజ్ గ్రూప్‌లో ఉద్యోగం చేస్తూ యాదృచ్ఛికంగా నటిగా మారిన ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని అంతర్గత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Additionally Learn : Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..

కాస్టింగ్ కౌచ్ గురించి సత్యకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఉందని అందరూ అంటారు, కానీ నిజానికి ప్రతి రంగంలోనూ ఈ సమస్య ఉంది. ఇది ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్ కాబట్టి ఇక్కడి విషయాలు త్వరగా బయటకు వస్తాయి. అందంగా ఉండే మహిళల పట్ల ఆకర్షణ కలగడం సహజం, కానీ అవతలి వ్యక్తి లిమిట్స్ దాటుతున్నప్పుడు వెంటనే ‘నో’ అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. నాకు వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోయినా, తోటి మహిళలు పడుతున్న ఇబ్బందులను చూశా.. ముఖ్యంగా అవకాశాల కోసం కొందరు కాదనలేక లొంగిపోతున్నారు. అది సరైన పద్ధతి కాదు. సినిమా కాకపోతే నాకు లైఫ్ లేదు అని అనుకునే వాళ్లే ఇలాంటి వలల్లో పడతారు. కానీ మనకు టాలెంట్ ఉంటే మరెన్నో అవకాశాలు వస్తాయి అనే నమ్మకం ఉండాలి. కొందరు మొదట అవకాశాల కోసం కమిట్‌మెంట్‌కు ఒప్పుకుని, ఆ తర్వాత దాన్ని రచ్చ చేయడం కూడా చూస్తున్నాం. ఏదైనా సరే, మన ప్రవర్తనను బట్టే ఎదుటివారు మనతో ప్రవర్తిస్తారు. బలవంతం చేసే సాహసం ఎవరూ చేయలేరు, ఒకవేళ చేసినా ఎదురుతిరిగే శక్తి ఉండాలి’ అని ఆమె స్పష్టం చేశారు. సత్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు ఆమె చెప్పిన ‘ధైర్యం’ అనే సూత్రం ఎంతో స్ఫూర్తినిస్తోంది.