Wed. Apr 22nd, 2026

చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను నమోదు చేసుకున్నాడు. సంక్రాంతి బరిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, రీసెంట్‌గా ‘బైకర్’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

అయితే, శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ఏప్రిల్ 26న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది.

శర్వా మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు సంయుక్త, సాక్షి వైద్య గ్లామర్ డోస్‌తో ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. మరి బుల్లితెరపై ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

The submit వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన శర్వానంద్ మూవీ..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.