Wed. Apr 22nd, 2026

ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ చేసిన యువ హీరో శర్వానంద్ నటిస్తున్న మరో లేటెస్ట్ సినిమానే ‘భోగి’. దర్శకుడు సంపత్ నందితో చేస్తున్న ఈ సినిమా మాత్రం ఫుల్ మాస్ యాక్షన్ తో కూడిన మసాలా డ్రామాగా రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుండగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం మేకర్స్ ఇప్పుడు రాజమండ్రి పయనమయ్యారు.

అక్కడ మొత్తం 10 రోజులు పాటుగా ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేయగా ఈ షెడ్యూల్ లో ఒక హై ఆక్టేన్ మాస్ యాక్షన్ బ్లాక్ ని తెరకెక్కించనున్నారట. దీనిపై ఓ స్పెషల్ వీడియోని కూడా మేకర్స్ వదిలారు. మరి ఈ యాక్షన్ సీన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతిలు నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శ్రీసత్య సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

The put up అక్కడ మాస్ యాక్షన్ లోకి దిగిన శర్వానంద్ ‘భోగి’ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.