Wed. Apr 22nd, 2026

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న పాన్ వరల్డ్ లెవెల్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా ఒకటి. వరల్డ్ఆడియెన్స్ లో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ సినిమాలో అనేక ప్రాంతాల్లో షూట్ తో పాటుగా భారీ ఎత్తున గ్రాఫిక్స్ వినియోగం కూడా ఉంటుంది.

ఇలా హైదరాబాద్ లోనే భారీ సెట్టింగులు మరియు సెపరేట్ మోషన్ కాప్చర్ స్టూడియోలో ఈ సినిమా సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా సెట్స్ లో ఇపుడు వారణాసి షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దేవర సినిమా కోసం అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం వేసిన సెట్స్ లోనే ఇపుడు వారణాసి తాలూకా సీన్స్ షూట్ కోసం వినియోగిస్తున్నట్టు టాక్. దీని ఈ బజ్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.

The put up ‘దేవర’ సెట్స్ లో ‘వారణాసి’? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.