Wed. Apr 22nd, 2026

ప్రస్తుతం మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన లైనప్ పరంగా కొంచెం తక్కువ సినిమాలతోనే ఉన్నాడని చెప్పాలి. ఇప్పుడు పెద్ది, తర్వాత సుకుమార్ తో ఓ భారీ సినిమా అధికారికంగా ఉన్నాయి. వీటి తర్వాత లైనప్ ఏంటి అనేది క్లారిటీ లేదు. అయితే మళ్ళీ ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా తోనే ఇంకో సినిమా ఉంటుంది అని పలు ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఇది ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయ్యిపోయింది అనుకోవచ్చు. తాజాగా బుచ్చిబాబు రిప్లై ఒకటి వైరల్ గా మారింది. చరణ్ పై ఓ మ్యాగజైన్ షూట్ వీడియో వైరల్ అవుతుండగా ఆ పోస్ట్ లో సర్, ఇంకొక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బుచ్చిబాబు మంచి ఎగ్జైట్మెంట్ తో రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ హింట్ తో వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పొచ్చు. మరి ఇది పెద్ది తర్వాత అనౌన్స్ చేస్తారా లేక పెద్ది ప్రీరిలీజ్ లోనే కన్ఫర్మ్ చేస్తారా అనేది వేచి చూడాలి.

The publish కన్ఫర్మ్: చరణ్, బుచ్చిబాబు మరోసారి రెడీ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.