Wed. Apr 22nd, 2026
God Of War : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్‌మెంట్‌ కు డేట్ లాక్

తారక్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబో ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక పౌరాణిక లేదా జానపద నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ కుమారస్వామి (Lord Kartikeya) పాత్రను గుర్తుచేస్తుండటంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలాంటి గెటప్‌లో కనిపిస్తారో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ‘షణ్ముఖుడు’ షూటింగ్ 2026 నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ప్రారంభం కానుందని టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువల తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నందమూరి అభిమానులకు పుట్టినరోజు కానుక ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజున ఏదో ఒక సర్ప్రైజ్ ఆశించే అభిమానులక, ఈసారి ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రకటన అసలైన కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ‘దేవర’, ‘వార్ 2’, ‘డ్రాగన్’ వంటి సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న తారక్ లైనప్‌ ఫుల్ బిజీగా ఉంది.