Fri. Apr 17th, 2026

ప్రస్తుతం భారతీయ సినిమా తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలో మొట్టమొదటి ఐమ్యాక్స్ సినిమాగా అనౌన్స్ చేసిన సినిమా “రామాయణ” కూడా ఒకటి. రణబీర్ కపూర్ రామునిగా సాయి పల్లవి సీతగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కంప్లీట్ గా హాలీవుడ్ సినిమా రీతిలో తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా నుంచి ఇటీవల రామ నవమి కానుకగా వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రం ఆడియెన్స్ నుంచి ఎదురు దెబ్బ తప్పలేదు. అయితే దీనిపై ఈ సినిమాలో రావణ పాత్ర చేస్తున్న స్టార్ నటుడు అలాగే నిర్మాతల్లో ఒకరైన యష్ స్పందించడం జరిగింది.

టీజర్ విజువల్స్ పరంగా వచ్చిన ట్రోల్స్ పై తాను మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఇంకా తాము ప్రోగ్రెస్ లోనే ఉన్నాము. అంతిమంగా వచ్చే ప్రోడక్ట్ లో మాత్రం ఎటువంటి రాజీ ఉండదు సినిమా టాప్ నాచ్ లో ఉంటుంది అని యష్ పేర్కొన్నారు. సో రామాయణ టీజర్ లో చూసిన విజువల్స్ ఫైనల్ అవుట్ పుట్ లో మరింత మెరుగు కానున్నాయి అని చెప్పవచ్చు.

The put up ‘రామాయణ’ విజువల్స్ ట్రోల్స్ పై యష్ క్లారిటీ! ఏమన్నాడంటే.. first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.