అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో అఖిల్ తనదైన మాస్ గెటప్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరి కాంబో ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ సాంగ్‌గా ‘ఎట్టా ఎట్టా’ అనే మాస్ నెంబర్‌ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ తమ కెమిస్ట్రీతో పాటు చక్కటి డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. భాస్కరభట్ల లిరిక్స్‌కు థమన్ క్యాచీ ట్యూ్న్స్ తోడవడంతో ఈ పాట మాస్ ఆడియన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా ఇంప్రెస్ చేస్తుంది.
ఇక ఈ సినిమాను నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 26, 2026న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The publish స్టెప్పులేయించేలా ‘ఎట్టా ఎట్టా’.. ‘లెనిన్’ మాస్ నెంబర్ అదిరిపోయింది! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
