Fri. Apr 17th, 2026

విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : టొవినో థామస్, కయాదు లోహర్, విజయరాఘవన్, సిద్ధిఖీ, శత్రు, బాబురాజ్ తదితరులు
దర్శకుడు : డిజో జోస్ ఆంటోని
నిర్మాణ సంస్థ: నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య, చరణ్
సంగీతం : జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం : టిజో టోమి
ఎడిటింగ్ : శ్రీజిత్ సారంగ్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పళ్లిచట్టంబి’ తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో రిలీజ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యామియో రోల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1950ల నాటి కేరళ నేపథ్యంలో, కమ్యూనిజం అణచివేతకు ఒక మతపరమైన బృందం కృష్ణ పిళ్ళై (టొవినో థామస్) అనే రౌడీని కాణియార్ గ్రామానికి తెస్తుంది. అయితే, కమ్యూనిస్ట్ యువతి రెబెకా(కయాదు లోహర్) పరిచయం అతని ఆలోచనలను మారుస్తుంది. ఇదే సమయంలో అతి క్రూరమైన నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఈ గందరగోళాన్ని వాడుకుని గ్రామాన్ని ఆక్రమించాలని చూస్తాడు. మరి కృష్ణ పిళ్ళై అధికారం వైపు నిలబడతాడా లేక అన్యాయాన్ని ఎదిరిస్తాడా అనేదే ఈ కథ.

ప్లస్ పాయింట్స్ :

టొవినో థామస్ మరోసారి తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అతడి పర్ఫార్మెన్స్ బాగుంది. కయాదు లోహర్ కూడా తనకున్న పరిధిమేర బాగానే ఆకట్టుకుంది. అయితే, ఆమె పాత్ర నిడివి మరికొంత పొడిగించి ఉంటే బాగుండేది.

శత్రు ఈ సినిమాలో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తాడు. అతని పాత్రలోని క్రూరత్వాన్ని అతడు పలికించిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్‌గా అనిపించి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యామియో బాగుంది. జేక్స్ బిజోయ్ బీజీఎం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పలు సీన్స్‌ను ఆయన ఎలివేట్ చేసిన తీరు బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. మాస్ ఆడియన్స్‌కు యాక్షన్ సీన్స్ నచ్చుతాయి.

మైనస్ పాయింట్స్ :

1950లో కేరళలో చోటు చేసుకున్న వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నారు. అక్కడి జనాలకు ఈ కథ తెలిసి ఉన్నా, ఇతరులకు అసలేం జరుగుతుందో అర్థం కాదు. పాన్ ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకున్నప్పుడు ఇలాంటి కథను ఇంకాస్త వివరించి చెప్పాల్సింది.

సినిమా కథనంలో క్లారిటీ మిస్ అయింది. కథలోని కోర్ పాయింట్ ‘విమోచన సమరం’ చుట్టూ తిరగడంతో దాని గురించి తెలిసి ఉన్న వారు మాత్రమే కథకు కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ మూమెంట్స్‌కు ఈ కోర్ పాయింట్ అడ్డంకిగా మారుతుంది.

ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగడం, ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా పేలవంగా ఉండటం మైనస్. స్క్రీన్ ప్లే పై మరింత ఫోకస్ పెట్టి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు డిజో జోస్ ఆంటోని ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ సినిమాలో హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నప్పటికీ కథలో ఎలాంటి ఆసక్తికరమైన అంశం లేదు. టిజో టోమి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చాలా వీక్‌గా అనిపించింది. జేక్స్ బిజోయ్ సంగీతం బీజీఎం పరంగా బాగుంది. తెలుగు డబ్బింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

తీర్పు :

ఓవరాల్‌గా, ‘పళ్లిచట్టంబి’ ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా పేలవమైన స్క్రీన్ ప్లే, ఆకట్టుకోని ఎగ్జిక్యూషన్‌తో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. టొవినో థామస్ డెడికేషన్, మంచి బీజీఎం సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. స్లోగా సాగే పేస్, ఆకట్టుకోని డబ్బింగ్, తదితర అంశాలు డిజప్పాయింట్ చేశాయి. మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా చూడాలనుకునే వారు ఈ వీకెండ్ వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.

123telugu.com Ranking: 2.5/5

Reviewed by way of 123telugu Staff 

Click on Right here For English Evaluation

The put up సమీక్ష : పళ్లిచట్టంబి – అటెంప్ట్ బాగున్నా ఆకట్టుకోలేకపోయింది first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.