Fri. Apr 17th, 2026

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంగా NBK111 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టులపై అప్పుడే ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే బాలయ్య యంగ్ డైరెక్టర్స్ వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటివారికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, ఇప్పుడు ‘బింబిసార’ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ ఒక భారీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వశిష్ట ఇటీవల బాలయ్యను కలిసి రెండు కథలను వినిపించాడని.. అందులో ఒకటి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సిద్ధం చేసిన కథ కాగా, మరొకటి బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ అని తెలుస్తోంది. ఈ రెండింటిలో తన కోసం సిద్ధం చేసిన కథకే బాలకృష్ణ మొగ్గు చూపారని, ఆ కథాంశం ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, వచ్చే ఏడాది ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట.

దర్శకుడు మల్లిడి వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో రామ్ చరణ్, చిరంజీవిలకు కథలు వినిపించిన వశిష్ట, ‘విశ్వంభర’తో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడు బాలయ్యతో సినిమా ఓకే కావడంతో వరుసగా టాలీవుడ్ టాప్ స్టార్స్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

The submit చిరంజీవి తర్వాత బాలయ్య.. లక్ అంటే ఈ డైరెక్టర్ దే..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.