Fri. Apr 17th, 2026

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘కర’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ‘డీ 56’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

మొదట ఈ ప్రాజెక్ట్ కోసం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. అయితే, ఆమె ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ యువ నటి సారా అర్జున్‌ను ఈ పాత్ర కోసం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ధురంధర్ చిత్రంతో నేషనల్ స్థాయిలో మంచి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

The put up రుక్మిణి వసంత్ తప్పుకుంటే, ధురంధర్ భామ వచ్చేనా..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.