పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఐతే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారట. ఈ షూట్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా పాల్గొంటారట.
కాగా లాస్ట్ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ పాత్రల పై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.
The submit ‘కల్కి సీక్వల్’ ఇంటర్వెల్ కోసం భారీ సెట్ ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
