ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ సినిమా థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయినా, మంచి కథ ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా విమర్శకులు ఈ సినిమాలోని కంటెంట్‌ను మెచ్చుకున్నారు. ఐతే, ఈ సినిమా సామాజిక సందేశాన్ని కలిగి ఉన్నప్పటికీ, ప్రేక్షకులపై బలమైన ముద్ర వేయడంలో విఫలమైంది. ఆ తర్వాత ఈ చిత్రం ETV Winలో అందుబాటులోకి వచ్చింది. ఐతే, ఓటీటీలో కూడా ఈ చిత్రానికి లభించిన స్పందన ఆశించిన స్థాయిలో లేదు. దీంతో, ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా, ఈ చిత్రం ఇప్పుడు ‘Aha’లో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.
ఈసారి అయినా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో వేచి చూడాలి. అన్నట్టు ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డులు లభించాయి. నటి భూమిక చావ్లాకు ఉత్తమ సహాయ నటిగా, గుణశేఖర్‌కు ఉత్తమ కథా రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ వంటి స్టార్స్ నటించగా కాల భైరవ సంగీతాన్ని అందించాడు.
The put up ఓటీటీ : అక్కడ కూడా ‘యుఫోరియా’ స్ట్రీమింగ్ ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
