ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు రాకా అనే భారీ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ హంగులతో చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకుడు అట్లీతో చేస్తున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ కోలీవుడ్ నుంచే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఐకాన్ స్టార్ తన కెరీర్ 23వ చిత్రాన్ని లాక్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది కానీ ప్రస్తుతం సినిమా కాస్టింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ మొదలయ్యాయి.
వీటి ప్రకారం బుట్టబొమ్మ పూజ హెగ్డే అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది అనే టాక్ వినిపించగా తనతో పాటుగా జాట్ బ్యూటీ రెజీనా కసాండ్రా కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుంది అనే టాక్ ఇపుడు మొదలైంది. సో వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The publish బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మతో పాటు ‘జాట్’ బ్యూటీ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
