Thu. May 14th, 2026

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, ‘రాజు వెడ్స్‌ రాంబాయ్‌’ దర్శకుడు సాయి కంపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “కొత్త సినిమాలను ప్రోత్సహించాలి. ఈ ట్రైలర్‌ చూడగానే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. నాడు దూరదర్శన్‌లో సినిమాలు చూసే నేను నటుడిగా మారాను. ఈ ‘దూరదర్శని’ సినిమా ప్రేక్షకులకు ‘సమీప దర్శని’గా మారి గొప్ప విజయం సాధించాలి” అని ఆకాంక్షించారు. 90వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ టైటిల్ కనెక్ట్ అవుతుందని దర్శకుడు సాయి కంపాటి అన్నారు.

జెమిని సురేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుందన్నారు. సినిమా విడుదల తర్వాత ఎమోషన్ అందరి హృదయాలను హత్తుకుంటుందని, ఇందులో నటీనటుల ప్రతిభ హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు కార్తీకేయ కొమ్మి తెలిపారు. ఎటువంటి అసభ్యత లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం, ప్రతి ఒక్కరికీ తమ సొంతూరిలో విహరించిన అనుభూతిని ఇస్తుందని, పెట్టిన డబ్బుకు కచ్చితంగా న్యాయం చేస్తుందని హీరో సువిక్షిత్‌ నమ్మకం వ్యక్తం చేశారు.

The publish ఘనంగా ‘దూరదర్శని’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.