ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ మరియు యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రాలపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వివిధ కారణాల వల్ల ఈ రెండు ప్రాజెక్టులు ఆలస్యమైనప్పటికీ, వీటిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయం తర్వాత ‘జన నాయగన్’ సినిమాకు బిజినెస్ పరంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం ఈ రెండు చిత్రాల డిజిటల్ హక్కులను విక్రయించేందుకు కెవిఎన్ ప్రొడక్షన్స్ పలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతోంది. ఈ రెండు సినిమాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు విక్రయించాలని, తద్వారా రికార్డు స్థాయి ధరను దక్కించుకోవాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఈ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
గతంలో ‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల కోసం కోరిన భారీ ధరను ప్లాట్‌ఫామ్‌లు తిరస్కరించినప్పటికీ, ఇప్పుడు రెండు చిత్రాలను కలిపి ప్యాకేజీగా విక్రయించేందుకు మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. ఎలాగైనా ఈ డీల్స్‌ను త్వరగా ముగించి, ‘జన నాయకన్’ మరియు ‘టాక్సిక్’ చిత్రాలను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కెవిఎన్ ప్రొడక్షన్స్ భావిస్తోంది.
The publish కెవిన్ఎన్ వారి డబుల్ స్ట్రాటెజీ.. టాక్సిక్‌తో పాటే జన నాయగన్..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
