Thu. May 14th, 2026
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?

 స్టార్ కిడ్స్ కేవలం నటనకే పరిమితం కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకత్వంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో షారుక్, సూర్య కిడ్స్ డైరెక్షన్ లో తమ ప్రతిభ చాటుకున్నారు. కొడుకు కోసం షారుక్ అన్ని తానై వ్యవహరించాడు. ఇప్పుడు ఇదే జాసన్ విజయ్ విషయంలో హాట్ టాపిక్ గా మారింది.  బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటుడిగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తండ్రి సపోర్ట్‌తో భారీ తారాగణాన్ని సెట్‌లోకి తెచ్చిన ఆర్యన్ ది బాడాస్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో తన సత్తా చాటుకున్నారు. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య-జ్యోతికల కుమార్తె దియా సూర్య చాలా చిన్న వయసులోనే దర్శకత్వంపై మక్కువ పెంచుకుంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీని రూపొందించి దర్శకురాలిగా మారింది.

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ కూడా తండ్రి బాటలో నటన వైపు కాకుండా దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సిగ్మా (Sigma) అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఏమైందనే దానిపై క్లారిటీ లేదు. విజయ్ – జాసన్ మధ్య మాటలు కూడా లేనట్టు కోలీవుడ్ టాక్. ఇటీవల జేసన్ సంజయ్ సోషల్ మీడియాలో తన తండ్రి విజయ్‌ను అన్‌ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే కొడుకు ఇలా స్పందించాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తండ్రి సపోర్ట్ లేకుండానే జేసన్ తన కెరీర్‌ను నిర్మించుకోబోతున్నాడా? లేదా ఇదంతా కేవలం వదంతులేనా? అన్నది కాలమే నిర్ణయించాలి.