Thu. May 14th, 2026

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మరో ఆసక్తికరమైన చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చింది. కిరణ్ అబ్బవరం నిర్మాతగా తెరకెక్కిన రూరల్ ఎంటర్టైనర్ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను వి.మునిరాజ్ డైరెక్ట్ చేయగా ఇందులో దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులు వెండితెరకు పరిచయం అయ్యారు.

అయితే, ఈ సినిమా మే 14 నుంచి ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రం ముందుగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో వారు ఈ చిత్రాన్ని మిగతా వారికంటే ఒక రోజు ముందుగానే వీక్షించవచ్చు. ఇక మిగతా వారు ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఆహాలో చూడగలరు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక మంచి వార్త అని చెప్పాలి.

మరి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో వేచి చూడాలి. ఇక మిగిలిన సాధారణ సబ్‌స్క్రైబర్లు అందరికీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. వైవిధ్యమైన కథలను ఆదరించే తెలుగు ప్రేక్షకులను ఈ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. విభిన్నమైన వినోదాన్ని కోరుకునే వారు ఈ వారాంతంలో ఈ సినిమాను వీక్షించవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit ఓటీటీలోకి వచ్చేసిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. అయితే వారికి మాత్రమే..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.